హాయ్ ఫ్రెండ్స్ ఇది చదివిన తర్వాత చాల మందికి ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది ఎందుకంటే తను చేసిన తప్పు ఎక్కువ రోజులు దాక్కోడు చాల త్వరగా పశ్చాతాప పడే టైం వస్తుంది.
ఇక విషయానికి వస్తే నేను ఒక రోజు చాల అర్జెంట్ గా చీపురుపల్లి నుంచి అనంతపూర్ వెళ్ళాల్సి వచ్చింది కాని నాకు రిజర్వేషన్ లేదు దాదాపు పదహారు గంటలు ప్రయాణం మరి ఎలా అని ఆలోచించి చివరకు స్టేషన్ వెళ్ళాను. ట్రైన్ రావడానికి ఇంకా అర గంట టైం వుంది. ఈలూగా ఒక సారి స్టేషన్ లో ఏమైనా కరెంటు రిజర్వేషన్ దొరుకుతుందేమూనని వెళ్లి ఒకసారి అడిగాను ఐతే మొదట లేదన్నాడు. ఇక ట్రైన్ రావడానికి కేవలం పదినిమిషాలు మాత్రమే వుంది. మరొక్క సారి చుఉడమని అడిగాను ఈసారి మాత్రం ఒక బుక్ లో చూసాడు, చివరికి ఒకీఒక బెర్త్ వుందని చెప్పాడు. నాకు ఆక్షణంలో చాల ఆనందం వీసింది. ఐతే వెంటనే అతను మరొక్క యాభై రుఉపాయలు ఎక్కువ అడిగాడు. ఒక్క క్షణం నాకు చాల షాక్ అనిపిచింది ఆ టైములో ఏమి చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అతను నాకు ఇవ్వక పోయిన మరింక ఎవ్వరికి ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ నేను తప్ప మరెవ్వరు లేరు. చివరిక్కి సరే నాన్నను. తీర ట్రైన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ నాలుగు బెర్త్లు కాలిగా ఉన్నాయి. నాకు నిజంగా చాల బాధ వేసింది. కేవలం యాభై రుపాయలకోసం అతను అబడ్దమడి అతని డిగ్నిటీ పోగొట్టుకున్నాడు.
సరే ఇదిలా ఉంటే ఒకరోజు నా స్టూడెంట్ ఒక అబ్బాయి నాదగ్గరకు వచ్చి తన తాలూకూ ఒక కంప్యూటర్ అమ్మడానికి నా సలహా కావాలని అడిగాడు. ఈలోగా దాన్ని కొనడానికి వచ్చిన పార్టీ కూడా మా ఇంటికి వచ్చారు. తీరా చుస్తే అతను ఎవరో కాదు నాకు టికెట్ అమ్మిన మహానుభావుడు. కాని అతను మాత్రం గుర్తు పట్టనట్టు నటించాడు. కాని నేను మాత్రం అతన్ని ఎప్పటికి మర్చి పోలేను కదండీ. చివరికి అతను లైన్ లో కి వచాడు సారి చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి తక్కువ ధరలో ఆ కంప్యూటర్ కావాలి.
డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎప్పటికైనా మనం చేసిన తప్పులు ఎక్కువరోజులు కనిపించకుండా వుంటాయా చెప్పండి. అప్పుడు నేను అతనితో ఒకే ఒక్క విషయం చెప్పను. సర్ మీరు ఎదుటు వ్యక్తి తాలుకు సమస్యను మీ ఆదాయంగా మార్చుకోకండి కాని అతనిలో మార్పు వస్తుందని నేను ఆశించటంలేదు. కాని చూడడం తప్ప నేను అంతకు మించి మరేం చేయలెంకదండి.
ధన్యవాదములు
కన్నా