డియర్ ఫ్రెండ్స్
చాలా రోజుల తర్వాత ఇలా మల్లి నా బ్లాగ్ లో కనిపిస్తానని అనుకోలేదు.
ఇంటర్ తర్వాత డిగ్రీ సిల్వర్ జూబ్లీ కాలేజి లో చదువుకోవాలని చాల కసిగా ఉండేది కాని అప్పుడున్న పరిస్థితులలో నాకు సీట్ రాలేదు అంటే నేనంత తెలివైన స్టూడెంట్ కాదులెండి అందుకే రాలేదు . ఇక అందరిలాగే ఏదో ఒక సాధారణ ప్రభుత్వ డిగ్రీ కాలేజి లో చేరి కొనసాగిద్దాం అనుకొన్నా కానీ అలా జరుగలేదు . ఏమైతేనేమి భూమి గుండ్రంగా ఉందంటే దానికి ఇదే ఒక మంఛి ఉదాహరణ నేను చదువుకోలేని కాలేజి లో కనీసం చదువు చెప్పే అద్రుష్టం నాకు కలిగింది .
ఎక్కడో విజయనగరం జిల్లా లో ఒక ఎయిడెడ్ కాలేజి లో స్థిరపడి పోతాననుకున్న సమయంలో సర్విస్ కమిషన్ ద్వారా మల్లి ప్రభుత్వ కాలేజి లో సెలెక్ట్ అయి ఆత్మకూర్ లో ఫర్స్ట్ జాయిన్ అయి నాలుగు నెలలు అవకముందే అటానమస్ కాలేజి ట్రాన్స్ఫర్ లో నేను కలలు గన్న కాలేజి లో పని చేసే అవకాశం నాకు వచిందంటే నాకు ఇప్పటికి నమ్మలేక పోతున్నా