Wednesday, December 17, 2008

ఢిల్లీ దర్శన్ లో సెక్స్ వర్కర్స్ తో

హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళాను. నేనొక లేక్టయూరేర్ అని ముందే చెప్పను కదండి కాబట్టి ఒక సెమినార్ పని మీద అక్కడికి వెళ్లాను. దాదాపు ఒక నెల రోజులు అక్కడే ఉన్నాను. ఈ సంధర్బం లో నా ఫ్రెండ్ గురించి చెబుతాను ఎందుకంటే నేను అతనితో నే ఉన్నానండి. ఆయన కుడా ఒక ఉద్యోగస్తుడు. అయితే మనకొక మేలు జరిగందండి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు సో ఆయనతో ఉండిపోయాను.
ఒక రోజు ఒక ఏఞీఓ వారు అతనికి ఒక చిన్న ప్రాజెక్ట్ ఆఫర్ చేసారు. మేము ఇద్దరమూ కలిసి విజయవంతం గా ఫినిష్ చేసాము. ఆ ప్రాజెక్ట్ లో కి వెళ్తే, మేము ఇద్దరమూ కలిసి ఒక ఆరుగురు సెక్స్ వర్కర్స్ ని వీధి నాటకం కోసం త్రనింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆమధ్య డిసెంబర్ ఒకటో తేదీ కోసం చేయమన్నారు సో చేసాము. అసలు విషం ఏంటంటే మేము కలిసిన ఆరు మంది లో ఐదుగురు ఆంద్ర వారే,అందులో ఇద్దరు ఇరవయ్ లోపే వాళ్ల జీవితం ఎంత అన్యాయం అయిందో చాల భాధ వేసింది. నేను వారితో ఒక వారం రోజులు మ్ట్లాదినాను ఒక్కొక్కరిది ఒక కథ. వారి జీవితం ధలారిలా చేతిలో ఎలా నాశనము అయిందో కళ్ళకు కట్టినట్లు చెప్పారు. అందుకే వారు వేసిన నాటకంలో మూడు ముఖ్యమైన సమస్యలను తీసుకున్నాము.
౧. ఒక సెక్స్ వర్కర్ తన పాపను స్కూల్ లో అద్మిస్సిఒన్ కోసం తీసుకెళ్తే అక్కడ ఆమెకు జరిగిన అవమానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాము. ఈ సీన్ లో ఆమె ఒక నిస్సహాయరాలు గా సమాజాన్ని ప్రశ్నిస్తుంది . ఎవరి వ్రుతులు వాళ్లు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చెయ్యకూడదు? మా పిల్లలు ఎం పాపం చేసారు? ఒక రిక్షావాడు రిక్షా తోలుకొని బతుకుతాడు, ఒక టేలర్ బట్టలు కుట్టి బతుకుతాడు,అలాగే ఒక టీచరు చదువు చెప్పి జీవిస్తాడు మరి మేము సెక్స్ పని చేశే తప్పా?
౨ ఇక రెండవ సీన్ లో ఒక సెక్స్ వర్కర్ కి వ్యాధి వస్తే అది ఎయిడ్స్ ఐతే మరి సమాజం అలాగే డాక్టర్ ఎలా చూస్తారు. ఎప్పుడైతే ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలుస్తుందో వెంటనే డాక్టర్ ఆమెను అక్కడనుంచి వెళ్ళిపొమ్మని అరుస్తాడు. ఒకవేళ ఆమెను బాగు చేయాలంటే ఒక లక్ష తీసుకరంమంటాడు. ఆమె రోదిస్తూ ప్రభుత్వాన్ని నిందుస్తుంది. ఆమె ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? తన ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాద్యత ఈ ప్రబుత్వానిదికాడ? ఒక ముసలి వ్యక్తికి ఫించను ఉంది , ఒక వికల్లన్గునికి ఫించను ఉంది, అలాగే ఒక చదుఉకునే విద్యార్థికి ఉంది,మరి మాకెందుకు లేదు? మేమేమి పాపం చేశామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.
౩ అలాగే మరి చివరి సీన్ లో కి వస్తే , ఒక రాజకీయ నాయకుడి ధోరణి ఈ సెక్స్ వర్కర్స్ పట్ల ఎలా వుంతుదోచుపించాము. ఒక ఎలెక్షన్ సమయంలో అతను ఎలా హామీలు ఇచి వాటిని తుంగలో తోక్కుతదో అనే ముఖ్యమైన అంశం. చివరికి వారందరు ఏకమై ఆ రాజకీయ నాయకుణ్ణి చావబాది వాళ్ల సమస్యను వారే పరిష్కరించుకోవాలని నర్నైన్చుకొని ఒక మహిళా సంఘాన్ని ఏర్పాతుచేసుకొంటారు.
ఇకపై వారికి ఎలాంటి సమస్యవచిన అది వారే పరిష్కరింహుకోనేంత సతికి ఎదిగారు. వారిలో నిజంగా అంత ఆత్మ స్థైర్యం వస్తుందని నేనస్సలు ఉహించలేదు.
చివరిగా వారు చాల అద్భుతనగా డ్రామా వేసారు. పెద్ద పెద్ద ఆఫీసుర్స్ ఈ డ్రామా ను తిలకించారు. ఇప్పుడు ఆ ఆరుగురు కాదు ఇంకా చాల మందిలో ఒక విప్లమాత్మకమైన మార్పు వస్తుందని ఆసిస్తూ.......
కన్నా

ఇంత ఊపికతో చదివిన మీకందరికీ నా వందనములు

No comments:

THE DOLL'S HOUSE BY Katherine Mansfield (Audio Lesson and Questions & Answers)

https://anchor.fm/dept-of-english/episodes/The-Dolls-House-e178t8v   Please click the above link and listen to the Audio lesson " The D...